భార్య పుట్టింటికి వెళ్ళిందని వ్యక్తి ఆత్మహత్య

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14: రిపోర్టర్ తిరుపతి సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెల్పిన వివరాల ప్రకారం కొండపాక మండలం మర్పడగ గ్రామనికి చెందిన మర్యాల అశోక్, వ. 43 సం.లు, గ్రామంలో కిరాణా షాపు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. అతని భార్య సంజన, వ. 28 సం.లు తో సంసార విషయం లో చిన్న, చిన్న మనస్పర్థలతో రెండు నెలల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకోని తన తల్లిగారింటికి బూర్గుపల్లి గ్రామనికి వెళ్ళింది. మృతుడు అప్పటి నుండి తన ఇంట్లోనే ఉంటున్నాడు. తేదీ: 13.02.2026 నాడు మద్యాహ్నం 2.20 గంటల సమయంలో మృతుని అన్న భాస్కర్ పలుమార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయక పోవడంతో అశోక్ ఇంటికి వెళ్ళి చూడగా ఇంట్లో ఉన్న రేకులతో వేసిన పై కప్పు పైపుకు తాడుతో ఉరి వేసుకోని చనిపోయి ఉన్నాడు. తన భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి వీరమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పరిశోదన ప్రారంభించినట్టు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెలియజేయడం జరిగింది.