సాక్షి డిజిటల్ న్యూస్ పిబ్రవరి.14: వేములవాడ ఆర్. సి. ఇంచార్జ్: సయ్యద్ షబ్బీర్… ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి మరియు రాజకీయ నాయకురాలు, భారత కోకిల గా ప్రసిద్ధి చెందిన సరోజిని నాయుడు 147 జయంతి సందర్భంగా ప్రాథమిక పాఠశాల న్యూ అర్బన్ కాలనీ వేములవాడ లో సరోజినీ నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ " భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి, రాజకీయ నాయకురాలు అని, భారత కోకిలగా ప్రసిద్ధి చెందారని, 1879 ఫిబ్రవరి 13న హైదరాబాదులో బెంగాలీ కుటుంబంలో జన్మించా రని, తండ్రి అఘోరనాథ్ ఛటోపాధ్యాయ శాస్త్రవేత్త, తల్లి వరద సుందరి దేవి కవయిత్రి అని, చిన్నప్పటినుండి చదువులో రాణించిన ఆమె లండన్ కింగ్స్ కాలేజీ, కేంబ్రిడ్జి లో ఉన్నత విద్య అభ్యసించారని, కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి భారతీయ మహిళ మరియు స్వతంత్ర భారతదేశపు తొలి మహిళ గవర్నర్ గా చరిత్ర సృష్టించారని, గాంధీతో కలిసి స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొని శాసనోల్లంఘన, క్విట్ ఇండియా ఉద్యమాలలో జైలుకు కూడా వెళ్లారని, ది గోల్డెన్ త్రెషోల్డ్ ,ది బ్రోకెన్ వింగ్స్, బర్డ్ ఆఫ్ టైం వంటి ఆంగ్ల రచనలతో గొప్ప కవయిత్రిగా గుర్తింపు పొందారని, దీనితో మహాత్మా గాంధీ ఆమెను 'నైటింగేల్ ఆఫ్ ఇండియా' అని పిలిచేవారని, 1905 లో బెంగాల్ విభజన తర్వాత స్వాతంత్ర్య ఉద్యమంలోకి ప్రవేశించిన ఆమె 1925 కాన్పూర్ కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించారని, గాంధీతో కలిసి దండియాత్ర (ఉప్పు సత్యాగ్రహం) లో పాల్గొన్నారని, 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యునైటెడ్ ట్రావెల్స్ (ప్రస్తుత ఉత్తర ప్రదేశ్) తొలి గవర్నరుగా నియమితులయ్యారని, 1949 మార్చి 2న లక్నోలో మరణించారని, మహిళ సాధికారత, అభ్యుదయ భావాల కోసం కృషిచేసిన సరోజిని నాయుడు సేవలు చిరస్మరణీయమైనవని" పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుర్శేటి లక్ష్మీనారాయణ, దాసరి సుజాత, అంగన్వాడి ఉపాధ్యాయురాలు లిక్కిడి మంజుల మరియు విద్యార్థులు పాల్గొన్నారు.