భక్తుల రద్దీకి సిద్ధం గాజులపల్లి ఆలయం – ఘనంగా శివపార్వతుల వివాహ వేడుకలు

(సాక్షి డిజిటల్ రిపోర్టర్ విగ్నేష్ ఫిబ్రవరి 14) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం: దొమ్మాట గాజులపల్లిలోని దక్షిణ కాశీ కైలేశ్వర ఆలయంలో నిర్వహించే శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా గురు దత్త పీఠాధిపతి కొడకండ్ల శ్రీరామ్ చరణ్ శర్మ గురూజీ మాట్లాడుతూ గ్రామాల మధ్యలో వెలసిన ఈ పురాతన ఆలయం పునర్నిర్మాణంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా మారిందన్నారు. ఆదివారం బ్రహ్మీ ముహూర్తంలో ఉదయం 4 గంటల 5 నిమిషాలకు సంతత ద్వారా అభిషేకం, గణపతి పూజ, పుణ్యవచనం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్ర హోమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గాజులపల్లి సర్పంచ్ పంజా స్వామి, వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ గొల్లపల్లి ప్రేమ్ కుమార్, అక్కం స్వామి, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *