బీరప్పగడ్డ వార్డులో దోమల నివారణకు స్వంత ఖర్చులతో ఫాగింగ్ యంత్రం ఏర్పాటు చేసిన ఇర్షాద్ ఖాన్ (ఉప్పల్ ఖాన్)….

*ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యంత్రాన్ని ప్రారంభించారు

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14/2026, మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ బీరప్పగడ్డ వార్డులో ప్రజలు దోమల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానిక యువ నాయకుడు ఇర్షాద్ ఖాన్ (ఉప్పల్ ఖాన్) తన స్వంత ఖర్చులతో ఫాగింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ కార్యక్రమం స్థానిక ప్రజల నుండి విశేష ఆదరణ పొందింది. ఈ ఫాగింగ్ యంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలను స్వయంగా గుర్తించి పరిష్కరించడానికి ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇర్షాద్ ఖాన్ ప్రజల సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.ఇర్షాద్ ఖాన్ మాట్లా డుతూ బీరప్పగడ్డ వార్డు ప్రజల ఆరోగ్యం తనకు అత్యంత ముఖ్యమని, దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటానని తెలిపారు. అవసరమైతే మరిన్ని ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పావన్ గౌడ్, దత్తు, జయమ్మ, అనిత, అనుష, గోరమ్మ, శరత్, అజీమ్, జునైద్, యాసీన్, అల్తాఫ్, ఆమర్, ఫహీమ్, అఫ్జల్, మొహ్సిన్, ఆసిఫ్, కిట్టు, శశి, సాయి తదితరులు పాల్గొన్నారు. అలాగే వార్డు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *