బి.ఎస్.పి కార్యాలయానికి స్థలం కేటాయించాలి

★జిల్లా కలెక్టర్ ను కోరిన బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ గౌడ్

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14 గూడూరు రిపోర్టర్ (చెన్నూరు మస్తాన్) జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయాలకి స్థలాల కేటాయించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ను కల బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి రాసిన భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు కోరారు. ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు కార్యాలయాలు ఏర్పాటు చేసుకు నేందుకు 50 సెంట్లు భూమి చొప్పున స్థలాలు కేటాయించాలని జీవో ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు సంబంధించి పార్టీ కార్యాలయాలకు నిర్వహణ కొరకు స్థలాల కేటాయించాలని జిల్లా కలెక్టర్ ను కోరామన్నారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% అవకాశం కల్పించన్నట్లు భాస్కర్ గౌడ్ తెలిపారు, ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఎల్వి సుబ్బయ్య, వెంకటేశ్వర్ల రాజు, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు మీజూరు సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.