సాక్షి, డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14, శంకరపట్నం, కరీంనగర్ జిల్లా, సీనియర్ జర్నలిస్ట్ రాజు . బూర్ల.!!
తిమ్మాపూర్ పరిధిలోని మహాత్మానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని సాంఘిక సంక్షేమశాఖ సమీకృత బాలికల వసతి గృహాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం సందర్శించారు. ఈ1 సందర్భంగా ఆయన హాస్టల్ గదులను పరిశీలించారు. హాస్టల్ ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని బాధ్యులను ఆదేశించారు. అంతేకాకుండా హాస్టల్ అవసరాలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వసతి గృహానికి అవసరమైన సౌకర్యాలను సమకూర్చుతానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. అనంతరం పక్కనే గల జడ్పీ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించారు. పాఠశాల తరగతి గదులతోపాటు క్రీడామైదాన్ని ఆయన పరిశీలించారు. క్రీడా మైదానం ముళ్ల చెట్లు, చెత్తా చెదారంతో పేరుకుపోయి ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే చెట్ల పొదళ్లు, చెత్తాచెదారాన్ని జేసీబీతో తొలగించి శుభ్రం చేయిస్తానని చెప్పారు. అంతే కాకుండా అక్కడికక్కడే జేసీబీ యజమానికి ఫోన్ చేసి పనికి పురమాయించారు. అంతేకాకుండా మైదానాన్ని రన్నింగ్ ట్రాక్ కు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే వెంట మహాత్మానగర్ సర్పంచ్ పొన్నాల సంపత్, ఉపసర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి, కాంగ్రెస్ నేత ఐతం మహేశ్ తదితరులు ఉన్నారు.