పోతవరం గ్రామంలో నూతన అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం గ్రామాభివృద్ధికి మరో ముందడుగు.

సాక్షి డిజిటల్ న్యూస్ దేవీపట్నం, ప్రతినిధి కె.ప్రకాశరావు. రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం, దేవారం గ్రామపంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన నూతన అంగన్‌వాడీ కేంద్రం ఘనంగా ప్రారంభమైంది. దేవారం–శరభవరం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ బాలల సమగ్రాభివృద్ధి – మహిళల సాధికారత – పోషకాహార లోప నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం మరియు ఆరోగ్య సేవలను నియమితంగా, సమయపాలనతో వినియోగించుకోవాలని సూచించారు. ఈ కేంద్రం (ఐసిడిఎస్) పథకం ఆధ్వర్యంలో నడుస్తూ గ్రామస్థులకు క్రింది ముఖ్య సేవలను అందిస్తుంది: 0–6 సంవత్సరాల పిల్లలకు ఉచిత పౌష్టికాహారం పంపిణీ ఆటపాటలతో కూడిన ప్రీ-స్కూల్ విద్య (నాన్-ఫార్మల్ ఎడ్యుకేషన్) గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ప్రత్యేక ఆహార ప్యాకేజీలు నెలవారీ బరువు తూకం, ఆరోగ్య పరీక్షలు రోగనిరోధక టీకా కార్యక్రమాలు పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ప్రత్యేక పర్యవేక్షణ తల్లిపాలు పట్టడం పై అవగాహన కార్య క్రమాలు కుటుంబ నియంత్రణ, ఆరోగ్య సలహాలు జనన–మరణాల నమోదు సేవలు ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన చిన్నారులే రేపటి భారత భవిష్యత్తు. అంగన్‌వాడీ కేంద్రాలను గ్రామ అభివృద్ధి కేంద్రాలుగా మార్చుకోవాలి అని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు మా పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక బలమైన అడుగు” అంటూ హర్షం వ్యక్తం చేశారు. కొత్త అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పోతవరం గ్రామంలో ఆరోగ్య, విద్యా మరియు పోషకాహార సేవలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తమైంది.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ అమ్మాజీ,ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్, భారత్ ఆదివాసీ పార్టీ డివిజన్ ప్రసార కార్యదర్శి చవలం విద్యాసాగర్, వార్డు మెంబరు కలుం వెంకన్న దొర, మండల ఎస్టీ కమిటీ చైర్మన్ సోదే వెంకన్న దొర, మడకం కృష్ణ దొర,కారం సత్యనారాయణ దొర,కారం కృష్ణ దొర,వార్డ్ మెంబర్ పండా రామలక్ష్మి, కారం రంగారావు దొర, మడకం వెంకటేష్ దొర, తుర్రం శివశంకర్ దొర, మడి మోహన్ దొర, మడి వెంకటలక్ష్మి, చవలం శాంతమ్మ, తుర్రం బాపనమ్మ,చోడి అఖిల్ దొర, మడకం సుధీర్ దొర, కంగాల గన్నేమ్మ, తుర్రం బుల్లమ్మ, తుర్రం అశ్విని దేవి, తుర్రం లోవ సత్య శ్రీ, తుర్రం మణి కుమారి, కారం సుధా, కుంజం లక్ష్మి మరియు గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.