పైలాన్ పునర్ నిర్మాణ పనులను పరిశీలించిన తెలుగుదేశం నాయకులు.

★కొండబాల కరుణాకర్.

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న) పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం సుభ్లేడు క్రాస్ రోడ్ మాదిరిపురం వద్ద తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మీ కోసం యాత్ర సందర్భంగా ఆవిష్కరించిన పైలాన్ ని నారా భువనేశ్వరి ఆదేశం మేరకు యస్ ఆర్ ఆర్ సంస్థ చేపట్టిన పునర్ నిర్మాణంలో వున్న పనులను పరిశీలించి న తెలుగుదేశం పార్టీ మాజీ పాలేరు ఇంచార్జ్ కొండబాల కరుణాకర్ , నాయకులు నల్లమోతు సత్యనారాయణ , కర్ణాటి అశ్వనీకుమార్ , మల్లెంపాటి లహరిన్ , సుబ్లేడు మాజీ ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పోలెపొంగు సాలయ్య , సుబ్లేడు తెలుగుదేశం పార్టీ గ్రామ కార్యదర్శి పోలెపొంగు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.