పెన్నా అహోబిలం దేవాదాయ భూముల్లో అక్రమంగా ఎర్ర మట్టి దందా

★దేవాలయ భూములను సైతం వదలడం లేదు ★పట్టపగలే అక్రమంగా మట్టి తరలింపు ★ధర్మకర్త పదవి కోసం అగ్రవర్ణలు, సామాజిక వర్గం మధ్య చితికిన పోరు ★అదే అదునుగా ఎర్రమట్టి దోపిడి లేపిన అక్రమార్కులు

సాక్షి డిజిటల్ న్యూస్, ఉరవకొండ ఫిబ్రవరి 14, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గ ఉరవకొండ మండలం పెన్నా అహోబిలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు ఆధ్యాత్మిక దైవంగా, వెలసినటువంటి పెన్నా అహోబిలం ఆలయం సమీపంలో తెలుగు తమ్ముళ్లు అక్రమాలకు ఆరులు చేస్తూ ఆఖరికి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ భూములను కూడా వదలకుండా పట్టపగలే అక్రమ ఎర్రమట్టి దందాకు తెరలేపారు.అయితే దేవాదాయ శాఖ కౌలు వేలం భూముల్లో రైతులు వ్యవసాయం చేస్తూ కౌలు చెల్లిస్తూ ఉంటారు. కౌలుదారుల నుండి వచ్చిన పన్నులతో ఆలయ ధూప దీప నైవేద్యాల కోసం ఖర్చు చేస్తూ అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అయితే దేవాలయానికి మాత్రం కౌలు భూముల నుండి వచ్చే ఆదాయమే ప్రధానం కాగా, తెలుగు తమ్ముళ్లు మాత్రం అక్రమ ఎర్రమట్టి దందా వ్యవహారం జోరుగా సాగిస్తూ దేవాలయ భూములను యదేచ్చగా కొల్లగొడుతు అక్రమంగా సొమ్మును చేసుకుంటున్నారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎర్ర మట్టిని తరలించకూడదని నిబంధనలు పెట్టి పలు కాన్ఫరెన్స్లో , సమావేశాల్లో చెప్పినప్పటికీ భూగర్భ గనుల శాఖ నుండి (మైనింగ్ కార్యాలయం నుండి)కానీ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పార్టీ పేరు చెప్పుకుంటూ ఆలయ భూముల్లో ఎర్రమట్టిని అక్రమంగా జెసిబి లు తో తవ్వి వాణిజ్య వ్యవహారాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ ఎర్రమట్టి వ్యవహారంపై ఎవరైనా ప్రశ్నిస్తే పార్టీ పేరు చెప్పుకుంటూ, ప్రజా ప్రతినిధులు పేరు చెప్పుకుంటూ ప్రజలను అధికారులను బెదరగొట్టి అక్రమ మైనింగ్ వ్యవహారం సాగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది, దాంతో ఆలయ అభివృద్ధి కోసం కేటాయించిన దేవాలయ భూములు సైతం దురాక్రమణకు గురి అవుతున్నాయి. అక్రమ ఎర్రమట్టి వ్యవహారంతో దేవాలయ భూములను కౌలుకు చేయడానికి రైతులు ముందుకు రావడం లేదంటే ఈ అక్రమ ఎర్రమట్టి వ్యవహారం ఏ స్థాయిలో జరుగుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇటీవల పెన్నోబిలం ఆలయం ధర్మకర్త కోసం అగ్రవర్ణాలకు, సామాజిక వర్గానికి మధ్య చితికిన పోరులో అదే అదునుగా అక్రమదారులు ఎర్రమట్టిపై కన్నేశారు. కాగా పెన్నాహోబిలం బ్రహ్మోత్సవాల సమయంలో నాయకులు ఫోటోలకు ఫోజులిస్తూ హడావుడి చేస్తూ అతి భక్తిని ప్రదర్శిస్తున్నారే తప్ప కానీ దేవాలయ భూములు పరిరక్షించాల్సిన బాధ్యత పార్టీ నియోజకవర్గ నాయకులకు వంట పట్టడం లేదని స్థానికులు ఒకరికి ఒకరు బహిరంగగా చర్చించుకుంటున్నారు. దేవాదాయ కౌలు భూముల్లో అడ్డగోలుగా అక్రమంగా మట్టిని తరలిస్తూ వ్యవసాయం చేయడానికి వీలుకాని రీతిలో పెద్ద పెద్ద గుంతలు తవ్వి ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ ఆలయ భూముల్లో మట్టి దోపిడీకి పాల్పడుతూ లక్ష్మీ నరసింహ స్వామికి నామాలు పెట్టి పట్టపగలే ఎర్ర మట్టిని తరలించి లక్షలాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు.ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకుండా నిత్యం ట్రాక్టర్లతో అక్రమంగా ఎర్ర మట్టిని తరలించి ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. మరి ఆలయ సన్నిధిలో ఇంత జరుగుతా ఉన్నా కూడా కనీసం ప్రభుత్వ ఉన్నత అధికారులు చర్యలకు ఉపక్రమించడం లేదు. విషయం ఏమిటంటే నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ఏ అధికారులతో నైనా పనిచేయించేది మేమే పర్యవేక్షించేది మేమే అని బహిరంగంగా ప్రగల్బాలు పలుకుతూ హడావుడి చేస్తూ యదేచ్చగా ఎర్రమట్టి అక్రమ మైనింగ్ కు పాల్పడంతో అధికారులు భయపడి ఈ సమస్య మాకెందుకు అన్నట్టుగా భయపడి అక్రమ మైనింగ్ అడ్డుకట్టు వేయడం లేదని దాంతో ఎర్ర మట్టి అక్రమ మైనింగ్ జోరుగా సాగిస్తున్నారని స్థానికులు వాపోయారు.ఈ అక్రమ ఎర్రమట్టి వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సాధించి పెన్నాహోబిలం దేవాలయ భూములను పరిరక్షించాలని మండల వ్యాప్తంగా ప్రజలు, స్థానిక కోరుతున్నారు.