సాక్షి డిజిటల్ న్యూస్ ఆనందపురం రిపోర్టర్ (భాగం స్వాతి సుధాకర్) ఫిబ్రవరి 14: “మాటలు తో కోటలు కట్టే వారి కంటే తేతలతో పని చేసే వారికే నా దగ్గర ప్రాధాన్యత ఉంటుంది అని చిన్న శ్రీను అన్నారు”. భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆనందపురం మండల వైసిపి పార్టీ కార్యాలయం లో “వైసిపి పార్టీ కమిటీల నియామకం” పర్యవేక్షణ కార్యక్రమం నిర్వహించారు.మండల వర్కింగ్ కమిటీ అద్యుక్షులు మజ్జి వెంకట్రావు కమిటీల నియామకం ప్రతులు ను చిన్న శ్రీను కు సమర్పించారు. కార్యక్రమం ను ఉద్దేశించి చిన్న శ్రీను మాట్లాడుతూ వైసిపి పార్టీ కోసం నిబద్దతతో పని చేసే వారికి,చురుకైన కార్యకర్తలకు,గ్రామ వార్డు స్థాయిలో ప్రజలతో బలమైన అనుబంధం ఉన్న వారిని పార్టీ కమిటీల్లో నియమిస్తూ ప్రాధాన్యత కల్పించాలని భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పార్టీ శ్రేణులు తో అన్నారు.నియోజవర్గంలో ఇప్నటకే అనుబంధ విభాగాల కమిటీలు పుర్తియ్యాయి మిగితా ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని నొక్కి చెప్పారు.పార్టీ కోసం శ్రమించి పని చేసే ప్రతీ ఒక్కరకీ భవిష్యత్తులో మంచి గుర్తింపు లభిస్తుంది అని చిన్న శ్రీను అన్నారు.పార్టీ కి కార్యకర్తలు బలం యువకులు వెన్నుముఖ అని ఆయన ఉద్ఘాటించారు.రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి చూడాలని ప్రతీ ఒక్కరికీ తపన ఉంది ఆయనను ముఖ్యమంత్రి చేయాలంటే మనలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు ను విడిచి పెట్టి వైసిపి పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు వైసిపి పార్టీ మన అందరి కుటుంబం అని ప్రతీ ఒక్కరు గ్రహించి గడప గడప కు వెళ్ళి ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయని పాలనను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమం లో ఆనందపురం మండల వర్కింగ్ కమిటీ అద్యుక్షులు మజ్జి వెంకట్రావు,మండల వైసిపి పార్టీ ఉపాధ్యక్షులు శినగం దాము,విశాఖ జిల్లా యువజన విభాగం మాజీ ప్రదాన కార్యదర్శి ఇల్లాపు వెంకట్ జగన్, నియోజకవర్గం విద్యార్థి విభాగం రౌతు శ్రీను,బుటుపిల్లి కళ్ళాలు యంపిటిసి, వాణిజ్య విభాగం అధ్యక్షుడు రాంజీ, నాయకులు శినగం రాంబాబు, శినగం అప్పల రాజు, తదితరులు పాల్గొన్నారు.