నేటి ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

సాక్షి డిజిటల్ న్యూస్ 14 ఫిబ్రవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, మెడికల్ ఫార్మా మాఫియా ఆగడాలను అరికట్టేందుకు నేడు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో నిర్వహించు ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి వేమల కన్నబాబు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నాసిరకం మందులు అధిక ధరలకు విక్రయించి సామాన్య ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆయన మండి పడ్డారు మందుల షాపుల యజమానులకు ఔషధాలపై అవగాహన లేనప్పటికీ డబ్బులు ఆశ చూపి వేరొకరి నుండి సర్టిఫికెట్లతో చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు ఔషధ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాల్సిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ఉన్నతా ధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు మెడికల్ ఫార్మసీ మాఫియా పై ప్రభుత్వం చర్యలు చేపట్టే వరకు ఉద్యమం కొనసాగిస్తామని కన్నబాబు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *