దిక్కు తోచని స్థితిలో రైతన్న..?

*డీలర్ల మాయా జలానికి రైతుల కష్టాలు.? * యూరియా దొరక్క రైతుల అవస్థలు పట్టించుకోని వ్యవసాయాధికార యంత్రము…

సాక్షి డిజిటల్ న్యూస్,14 ఫిబ్రవరి 2026, రామన్నపేట మండలం రిపోర్టర్, శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేదిస్తుంది. మండలంలోని ఎరువుల డీలర్లకు ఎవరికైనా సరకు నిల్వ రాగానే డీలర్లు సిండికేటుగా ఏర్పడి సరకు నిల్వలను పంచుకుని తమకు అనుకూలురైన రైతులకు మాత్రమే సరకు వచ్చిన విషయం అందజేసి వారికి మాత్రమే అమ్మకం చేస్తున్నారు. ఒకవేల సరకు నిల్వ మండలంలోని ఏ డీలరుకు వచ్చినా 10-15 నిమిషాలలోనే అయిపోతుంది. దీనివల్ల మిగతా రైతులకు యూరియా ఎపుడు వస్తుందో, ఎపుడు అయి పోతుందో సరైన సమాచారం ఉండకపోవడం వల్ల యూరియా యాప్ లో బుకింగ్ చేసుకోలేక పోతున్నారు. దురదృష్టవశాత్తూ ఈ విషయంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ డీలర్లకు సహకరిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల సాగు కాలంలో నిజమైన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు రోజుల తరబడి యూరియా దొరకక ఖాళీ చేతులతో తిరిగి వెళ్తుండటంతో వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయి. కావున, ఈ విషయంపై సంబందిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి సరైన పర్యవేక్షణ ద్వారా అందరు రైతులకు యూరియా సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *