తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికుల పని చేయాలి

*ఆలూరు ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం ప్రసాద్

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద ఫిబ్రవరి14, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి వైకుంఠం ప్రసాద్ లు అన్నారు ఈ సందర్భంగా మండల కేంద్రమైన హోళగుంద లోని ఎల్.ఎల్.సి గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ లోనీ మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, క్యాడర్ మీటింగ్ మరియు రాబోయే ఎన్నికల దృష్ట్యా కమిటీల ఏర్పాటుపై ముఖ్యమైన దిశా నిర్దేశం చేయడానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించామని వారు తెలియజేశారు గత 43 సంవత్సరాల నుండి మామ అయిన వైకుంఠం శ్రీరాములు టిడిపి పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని వారు తెలియజేశారు నియోజకవర్గ ప్రజలు బాగోగులతోపాటు నియోజకవర్గ అభివృద్ధి ఎల్లప్పుడూ ముందుండి సేవ చేస్తున్నామన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా అధర్య పడవద్దని ఎల్లప్పుడూ తమ వెంట మేమున్నామని నాయకులకు కార్యకర్తలకు హామీ ఇచ్చారు గత వైసిపి పాలనలో అభివృద్ధి నోచుకోలేదని ప్రస్తుతం ఎమ్మెల్యే విరుపాక్షి కుటుంబ ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేదంటూ విమర్శించడం తగదు అన్నారు కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు గురించి బహిరంగంగా తాము చర్చకు సిద్ధమని వారు తెలియజేశారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 5వ సారి నారా చంద్రబాబు నాయుడు ని సీఎం చేయడం ఖరారని వారు తెలియజేశారు ఆలూరు నుండి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతామని ధీమా వ్యక్తం చేశారు గత కొన్ని సంవత్సరాలుగా దానాపురం హోళగుంద రోడ్డు గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి రూ 14 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేపించుకొని వచ్చిన ఘనత వైకుంఠం జ్యోతి వైకుంఠం ప్రసాద్ ది అన్నారు త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభమై మండల ప్రజల కోసం తమ వంతుగా కృషి చేస్తున్నామని వారు తెలియజేశారు వైసిపి హయాంలో ఎలాంటి రోడ్డు నిర్మాణ పనులు చేయక గాలికి వదిలేసారని ఎద్దవ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు నుండి అన్ని రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతు న్నాయని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోవింద్ గౌడ్, చిన్న హాట శేషగిరి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య సింగల్ ఏంటో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అబ్దుల్ సుభాన్ బకాడీ వీరేష్ గిరి వలి భాష మురళి కడప హనుమంతు ఎల్లార్తి మల్లికార్జున సుధాకర్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *