జెడ్ పి హెచ్ ఎస్ కొండపాక లో సీఎం కప్ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14:రిపోర్టర్ తిరుపతి జెడ్ పి హెచ్ ఎస్ కొండపాక పాఠశాల లో సీఎం కప్ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి బాక్సింగ్ పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ మాంచాల నవీన శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్ పిడి నర్రా భాస్కర్ రెడ్డి ప్రారంభించారు ఇట్టి పోటీలలో సిద్దిపేట జిల్లాలోని 50 మంది యువకులు మరియు 30 మంది యువతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు బాక్సింగ్ నిర్వాహకులు కృష్ణ ప్రతాపరెడ్డి చక్కగా పర్యవేక్షించారు క్రీడల అనంతరము విద్యార్థులకు మెడల్స్ కప్స్ బహుమతులు అందజేయబడ్డాయి.