జిల్లాలో జిల్లా పర్యాటక మండలి సూ చించిన రెండు పర్యా టక ప్రదేశాలలో లీజు కొరకు దరఖాస్తులు

★ఆహ్వానించబడుతున్నాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్,తెలియజేశారు

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు
అమలాపురం జిల్లాలో శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ ఆడిటోరియం, కేఫెటెరీయ, రెస్టారెంట్, వెయిటింగ్ హాల్, మరియు సాహస క్రీడలు నిర్వహణ కొరకు ఆసక్తి గల మరియు సంబంధిత ఆతిథ్య రంగం లో కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తులు,సంస్థల నుండి బిడ్లు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.వీటిలో మొదటిది మామిడి కుదురు మండలం పాశర్ల పూడి గ్రామం నందు ఓపెన్ ఆడిటోరియం, కేఫెటెరీయ & రెస్టారెంట్, వెయిటింగ్ హాల్, మరియు సాహస క్రీడలు నిర్వహణ నిమిత్తం 2833 చ.మీ. కనీస బాడుగ రూ.5,00, 000లు చెల్లిం చనున్నట్లు తెలిపారు. రెండవది మామిడికుదురు మండలం అదుర్రు గ్రామం నందు ఓపెన్ ఆడిటోరి యం, కేఫెటెరీయ రెస్టారెంట్, వెయి టింగ్ హాల్, మరియు సాహస క్రీడలు నిర్వహణ కొరకు 4047 చ.మీ.(ఒక ఎకరం) కనీస బాడుగ రూ.3,00, 000 లు నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు రూ 5000 డిపాజిట్ను అధ్యక్షులు జిల్లా పర్యాటక కౌన్సిల్, మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ పేరున డి డి రూపం లో ఇచ్చి బిడ్ ఫారంను జిల్లా పర్యాటక అధికారి, కోఆర్డినేట్ సెక్షన్, కలెక్టరేట్ కార్యాలయం, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నందు 16.02.2026 తేది నుండి 02.03.2026 వరకు ఉదయం 11.00గం. నుండి సాయంత్రం 3.00 గం. మధ్య కార్యాల యపు పని దినాలలో పొంద గలరన్నారు. ఈనెల 16 వ తేది నుండి మార్చి 2 వ తేదీ వరకు కార్యాలయపు పని వేళల లో ఉదయం 11. 00గం నుండి సాయంత్రం 3.00గం. వరకు బిడ్ ఫారాలు స్వీకరించబడు నన్నారు. మార్చి రెండవ తేదీ సాయంత్రం 4.00 గంటల కు బిడ్లు ఓపెన్ చేయబడునన్నారు. బిడ్లు వేయుటకు కావలసిన అర్హతలు, నిర్వహణ నియమావళి, వార్షిక లీజు స్థిరీకరణ షెడ్యుల్ నందు పొందుపరచడం జరిగింద న్నారు. బిడ్లు రద్దు పరచు అధికారం జిల్లా కలెక్టర్కు కలదన్నారు.ఇతర వివరములకు జిల్లా పర్యాటక అధికారి పర్యాటక శాఖ, కోనసీమ జిల్లా సంప్రదించాల్సిన చరవాణి నెంబర్ 9121725757 గా నిర్దేశించామని జిల్లా కలెక్టర్ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.