జగద్గిరిగుట్ట అక్రమ్ నిర్మాణాలు. కభ్జలపై ఎమ్మార్వో కి పిర్యాదు.ఆకుల సతీష్ టీమ్ .

సాక్షి డిజిటల్ న్యూస్ కుత్బుల్లాపూర్. రిపోర్టర్ (నటరాజ్ గాడ్) 14. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ జగద్గిరిగుట్ట ప్రాంతంలోని సర్వే నెంబర్ 348/1 లో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి డబ్బాలు ఏర్పాటు చేయడం, సంఘాల పేరుతో ఆక్రమణలు చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న విషయంపై ఎమ్మార్వో ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకుని కొంతమంది ప్రవేటు వ్యక్తులు చందాలు వసూలు చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారని మా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి: ప్రభుత్వ భూములపై జరుగుతున్న అన్ని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలి. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ప్రభుత్వ ఆస్తులను రక్షించే చర్యలు చేపట్టాలి. అదేవిధంగా, ఈ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఫిర్యాదు చేసిన స్థానికులపై అధికార-ప్రతిపక్ష నాయకులు కబ్జాదారులతో కుమ్మక్కై దాడులకు ప్రయత్నిస్తే, అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. సామాన్య ప్రజల జోలికి వస్తే ఖబర్దార్ అని ఆకుల సతీష్ హెచ్చరించారు. బాధితులు కబ్జాదారుల దాడులు, బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, వారికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రజా ఆస్తుల పరిరక్షణలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే సహించబోమని ఆకుల సతీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయశంకర్,మధు, పాండు, అరుణ్ రావు పాల్గొన్నారు.