చిట్యాల మున్సిపాలిటీ లో చారిత్రాత్మక తీర్పు స్వతంత్ర అభ్యర్థి నాగిళ్ల సుధాకర్ ఘనవిజయం

*ట్రాన్స్ జెండర్ ఘనవిజయం

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 నల్గొండ జిల్లా చిట్యాల మండలం, చిట్యాల మున్సిపాలిటీ రాజకీయ చరిత్రlo ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైంది ప్రజాస్వామ్య విలువలకు ప్ర తీగా నిలిచే ఈ ఘట్టంలో ఒకటవ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్ జెండర్ నాయకుడు నాగిళ్ల సుధాకర్ 13 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించడం విశేషం. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ ఎన్నికలు సాధారణ స్థానిక ఎన్నికలకే పరిమితం కాకుండా సామాజిక మార్పు దిశగా అడుగులు మారాయి ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను వెనక్కి నెట్టుతు ప్రజల నమ్మకాన్ని సొంతం చేసుకున్న సుధాకర్ విజయం స్థానిక రాజకీయాల్లో సంచలనంగా మారింది ప్రచారం దశ నుంచి ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహన పారదర్శక పరిపాలనపై హామీ సామాజిక సమానత్వం పై దృష్టి అని బలంగా నీ లిచారు యువత మహిళలు అణగారిన వర్గాల నుంచి విస్తృత మద్దతు లభించింది స్వతంత్ర అభ్యర్థిగా ఎలాంటి పార్టీ అండా లేకుండానే 103 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించింది రాజకీయ వర్గాలు చర్చనీయాంశమైనది. ట్రాన్స్ జెండర్ సమాజానికి గర్వకారణం సాధారణ రాజకీయాలలో ఆశ హవులకు పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఈ విజయంతో సమాన హక్కులు సమాన అవకాశాలపై చర్చ మళ్ళి ముందుకు వచ్చింది స్థానిక ప్రజలు మా సమస్యలను అర్థం చేసుకొని అభ్యర్థిని గెలిపించామంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం ఈ ఫలితం ప్రజల్లో మారుతున్న మనోభావాలకు ప్రతిబింబం వ్యక్తం సేవా భావం నిబద్ధత ఇవే విజయానికి మూల కారణాలుగా భావిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *