చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

*చిట్యాల మున్సిపాలిటీ అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది మున్సిపాలిటీలోని 12 వార్డులకు గాను 9 వార్డులను కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకున్నారు

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 నల్గొండ జిల్లా చిట్యాల మండలం, చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగరవేసిన మొత్తం 12 వార్డులకు గాను 9 వార్డులను కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకోగా మరో రెండు వార్డులను బిఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు ఒక వార్డులో హను వ్యూహంగా ట్రాన్స్ జెండర్ గెలుపొందింది మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బి ఆర్ఎస్ తో పాటు బిజెపి బి.ఎస్.పి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రచారం నిర్వహించగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా బి ఆర్ఎస్ అభ్యర్థుల తరపున మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రచారం నిర్వహించారు నువ్వా నేనా అనే విధంగా ప్రచారం నిర్వహించినప్పటికీ విజయం మాత్రం కాంగ్రెస్ అవలీలగా సాధించింది. 12 వార్డులకు గాను ఒకటో వార్డ్ శివనేని గూడెంలో పొత్తులో భాగంగా సిపిఎం పార్టీ అభ్యర్థి జిట్ట నగేష్ బరిలో నిలువగా అతనిపై 103 ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్ అభ్యర్థి ట్రాన్స్ జెండర్ గెలుపొందారు రెండవ వార్డులో బి ఆర్ఎస్ అభ్యర్థి షేక్ షబానా అజీమ్ మూడో వార్డు గాలి యాదమ్మ లింగయ్య నాలుగో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోనేటి ఎల్లయ్య ఐదో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గుండెబోయిన లక్ష్మి సైదులు ఆరో వార్డు అభ్యర్థి జె ర్రిపోతుల సత్యనారాయణ ఏడో వాడు కాంగ్రెస్ అభ్యర్థి దేశపాక లతా రాజేష్ 8 అభ్యర్థి కుక్కల మోహన్ 9వ అభ్యర్థి ఏర్పుల పరమేష్ 11 వ అభ్యర్థి బొబ్బిలి సందీప వెంకట్ రెడ్డి 12వ వార్డ్ అభ్యర్థి పందిరి గీత పదవ వార్డ్ అభ్యర్థి బిఆర్ఎస్ కు చెందిన నిమ్మల గోటి శ్రీను విజయ సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *