సాక్షి డిజిటల్ న్యూస్, 14 ఫిబ్రవరి 2026, బూర్గంపహాడ్ మండలం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ రాయల నవీన్: తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొన్నది. ఈ రోజు పార్టీ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు రాష్ట్ర కమిషన్ కమిటీ చైర్మన్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఇన్‌చార్జ్ బంచాడు నర్సయ్యగౌడ్ పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షుడు మల్లెలు వీరన్న ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్య క్రమం ఘనంగా జరిగింది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. బూర్గంపాడు మండల పార్టీ అధ్యక్షుడు వి.రామకృష్ణ సమర్థవంతమైన నిర్వహణలో ఈ కార్యక్రమం వికసిత మైంది. జిల్లా అధ్యక్షుడు మల్లెలు వీరనారాయణ పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వీరన్న, తీన్మార్ మల్లన్న ఆశయాలు, దృష్టి పూర్తిగా అమలు చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, కార్యకర్తలందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికార పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారానికి, స్థానిక అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు స్రవంతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర ప్రశాంత్ గౌడ్, ఉపాధ్యక్షురాలు వి.తిరుపతమ్మ, సెక్రటరీ డి.లక్ష్మి, కార్మిక విభాగం నాయకుడు ఎం.రమేష్, జిల్లా యూత్ లీడర్ ఎడరీ రమేష్ తదితర ప్రముఖ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం సమర్థవంతంగా ముగిసిన తర్వాత, పార్టీ స్థాయిలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి కార్యకర్తలను ఉత్తేజపరచాలని నిర్ణయించారు. ఈ జెండా ఆవిష్కరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీ ఆకట్టుకునేలా మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది.