గ్రామీణ వైద్యుడి కుటుంబానికి అండగా నిలిచిన యూనియన్ సభ్యులు

★ఆర్థిక సహాయం అందచేసిన యూనియన్ సభ్యులు

సాక్షి డిజిటల్ న్యూస్ 14 ఫిబ్రవరి, మహాదేవపూర్ మండలం, (తులసి మహేష్) మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యులు ముక్తి రాజబాపు ఈ నెల 3 వ తేదీ అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోవడంతో తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబానికి మహాదేవపూర్ గ్రామీణ వైద్యుల సభ్యులు ఆర్ధిక సహాయం చేసినారు. భవిష్యత్తులో కూడా ఏమన్నా అవసరం ఉన్నా కూడా అడగండి అందరం కలిసి సహాయం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, మహాదేవపూర్ మండల యూనియన్ అధ్యక్షులు కల్వచర్ల రమేష్, ప్రధాన కార్యదర్శి మోరే సతీష్, మాజీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, తోటి గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.