సాక్షి డిజిటల్ న్యూస్ బాలాయపల్లి :మండలంలోని అన్ని గ్రామాల్లో పొదుపు సంఘాలు సభలు పెట్టి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వెలుగు పథకం ఏపీఎమ్ కిరణ్ పేర్కొన్నారు శుక్రవారం మండల కేంద్రంలో ఉన్న స్త్రీ శక్తి భవనంలో పొదు పు సంఘాల పై సమీక్ష సమావేశం నిర్వహించా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి సభలో నిర్వహించ లేదు కాబట్టి వెంటనే ప్రతి గ్రామాల్లో పొదుపు సభ్యులు నిర్వహించి ఇప్పటివరకు ఎంతమంది బ్యాంకుల ద్వారా రుణాలు పొందారు వారి వద్ద నుంచి వెంటనే రికవరీ చేయించే బాధ్యత వివో ఏలు పైన ఆధారపడి ఉందని తెలియజేశారు. అంతేకాకుండా పొదుపు సంఘాల్లో మొండి బాకీలు ఉంటే వారికి సబ్సిడీ వర్తించదని గ్రామసభలో తెలియజేసి వాళ్ళ వద్దకు వెళ్లి వెంటనే రికవరీ చేయించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.