కార్తికేయ సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ F1 హైబ్రిడ్ మిరప, ఈశ్వర్-19 లతో రైతులకు అధిక దిగుబడి…

*న్యూ కృష్ణ ఎంటర్ప్రైజెస్ లింగాల ఉమేష్.

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) గార్ల మండలంలోని ఫుల్లురు గ్రామంలో కార్తికేయ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి F1 హైబ్రిడ్ మిరప ఈశ్వర్ -19 మిర్చి రకం కుక్కల పుల్లయ్య కు చెందిన మిర్చి తోటను శుక్రవారం స్థానిక రైతులతో కలిసి న్యూ కృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రోప్రైటర్ లింగాల ఉమేష్ న్యూ కృష్ణ డిస్ట్రిబ్యూటర్స్ సందర్శించారు ఈ సందర్భంగా న్యూ కృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రోప్రైటర్ లింగాల ఉమేష్ మాట్లాడుతూ మిర్చి రైతులకు అధిక దిగుబడి, అత్యధిక రాబడి నిచ్చు హైబ్రిడ్ మిరప సన్న రకం, ముదురు ఎరుపు రంగులో ఉండి అధిక ఘాటు కలిగినది,ఆయిల్ శాతం ఎక్కువ ,మొక్కలు మరియు కొమ్మలు దృఢముగా వ్యాపించే రకము ,ఎకరానికి 30 క్వింటాలు దిగుబడి వస్తుందని రైతులు నాణ్యమైన విత్తనములను ఎంపిక చేసుకోవాలని,ఈ యొక్క విత్తనం కాయ సైజు మరియు ఎరుపు రంగు కలిగి ఉండడం, ఇక్కడ నేలలకు చాలా అనువుగా ఉంటుందని మరియు ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితి లో కూడా నల్లిని తట్టుకొని కాపు బాగా వచ్చిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా డిస్ట్రిబ్యూటర్ న్యూ శ్రీకృష్ణ ఎంటర్ ప్రైజెస్ ,గార్ల ,లింగాల ఉమేష్, నాగ మహేశ్వర ఎంటర్ ప్రైజెస్ , ఖమ్మం ,లింగాల మహేష్, బుర్ర భాస్కర్, గణేష్ , గార్ల మండల చుట్టుపక్కల గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *