కళ్యాణపు లోవ శివరాత్రి ఉత్సవాలకు భారీ బందోబస్తు

★ భక్తులు యాత్రికులు పోలీసు వారి సూచనలు పాటించి ప్రశాంత దర్శనం చేసుకోవాలి ★కొత్తకోట సిఐ కోటేశ్వరరావు

సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం ఫిబ్రవరి 14: ఈనెల 15 నుంచి 17 వరకు మూడు రోజులు పాటు జరిగే కళ్యాణపులోవ శివరాత్రి మహోత్సవములుకు 500 మంది పోలీస్ సిబ్బంది,స్పెషల్ పార్టీ తో బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు యాత్రికులు పోలీసు వారి సూచనలు పాటించి ప్రశాంతమైన దర్శనం చేసుకుని సుఖంగా ఇళ్లకు చేరుకోవాలని కొత్తకోట సిఐ జి కోటేశ్వరరావు శుక్రవారం తెలిపారు . లక్షల సంఖ్యలో భక్తులు యాత్రికులు వివిధ జిల్లాల నుంచి వస్తున్న దృశ్యా రద్దీ ఎక్కువగా ఉంటుందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.రిజర్వాయర్లో భక్తులు స్నానాలు చేసేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 20 బోట్లు, 30 మంది గజ ఈత గాళ్లతో రిజర్వాయర్లో గస్తీ నిర్వహించడం జరుగుతుందన్నారు.మరియు 20 సీసీ కెమెరాలు ఉత్సవ ప్రాంతంలో అమర్చి, ఉత్సవాన్నినిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ సంబంధించి, దొండపూడి చెక్ పోస్ట్ నుండి కళ్యాణపులోవ వరకు రోడ్డు పై ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ట్రాఫిక్ సిబ్బందిని నియమించడం జరుగుతుంద న్నారు. దొండపూడి చెక్ పోస్ట్ నుండి టూ వీలర్స్, ఆర్టిసి బస్సులను కళ్యాణపు లోవ రిజర్వాయర్ వరకు అనుమతించబడుతుందని. ఆటోలు మరియు గూడ్స్ వెహికల్స్, ఇతర భారీ వాహనలు దొండపూడి నుండి లోపలకు అనుమతించబడవన్నారు.వాటిని దొండపూడి చెక్ పోస్ట్ దగ్గర నిర్దేశించిన పార్కింగ్ స్థలంలో పార్క్ చేయవలెనన్నారు.అదే విధముగా, రోడ్డు మార్గంలో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కొత్తకోట, దొండపూడి గ్రామాల్లో వాహనంలు కొంత సమయం నిలుపుదల చేసి, రద్దీ తగ్గిన తర్వాత వెంటనే వాటిని పంపించడం జరుగుతుందని, డామ్ పైన దేవాలయం ప్రాంగణంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ని ఏర్పరిచి, భక్తులకి సహాయం చేయుటకు నిరంతర మైక్ ద్వారా వారు తీసుకోవలసిన జాగ్రత్తలు వారికి తెలియచేస్తూ, ఏ విదమైన సహాయ సహకారాలు కావలసిన పోలీస్ వారిని సంప్రదించే విధంగా, మైక్ ద్వారా ప్రచారం చేయబడుతుందన్నారు. జేబు దొంగతనాలు, మహిళలపై ఈవ్ టీసింగ్ జరగకుండా సాధారణ దుస్తులలో పోలీస్ సిబ్బందిని నియమిం చడం జరుగుతుందన్నారు. భక్తులు అందరూ పోలీసు వారు నిర్దేశించిన ప్రదేశంలో టూ వీలర్స్, బస్సులు, కార్లు, పార్క్ చేయవలెనని, భక్తులందరూ కూడా పోలీస్ వారి సూచనలు పాటించి, అందరూ సుఖ ప్రయాణం చేసి ఉత్సవాన్నిజయప్రదం చేయాలని కోరారు. శేషు రావికమతం.