ఎస్సీ కార్పొరేషన్ కు నిధులు విడుదల చేయాలి

సాక్షి డిజిటల్ న్యూస్ / ఫిబ్రవరి 14 అడ్డగూడూరు రిపోర్టర్ నోముల ఉపేందర్ తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కు 12 వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరెళ్ల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అడ్డగూడూరు మండల కేంద్రంలోని జిల్లా అధికార ప్రతినిధి బాలెంల పరుషరాములు అధ్యక్షతన జరిగిన మండల ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూరెళ్ళ రమేష్ మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్కు 12 వేల కోట్ల రూపాయలను మంజూరు చేసి విడుదల చేయాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యకు 35% నిధులు విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే ఎస్సీలకు అసైన్మెంట్ భూములకు పక్క పట్టాలిచ్చి అమ్ముకొనుటకు హక్కు కల్పిస్తానన్న మాటలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బైరపాక నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు బొట్ల శ్రీనివాస్, అడ్డగూడూరు మండల అధ్యక్షులు ఇటికాల అంజయ్య, ఇటుకల డిన్ను, శ్రీను, మహేష్ తదితరులు పాల్గొన్నారు.