ఎంపీపీ పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన మండల విద్యాశాకాఅధికారి ద్వారకనాధ్

సాక్షి డిజిటల్ న్యూస్, కురబలకోట ఫిబ్రవరి13:- (రిపోర్టర్ రామాంజనేయులు) కనసానివారిపల్లి గ్రామ పంచాయతీ నందు గల ఎం పి పి యస్ దిగువ బోయపల్లి పాఠశాలను ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం ఊరి బడిని కాపాడుకుందాం కార్యక్రమములో ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల విద్యశాఖఅధికారి ద్వారాకనాధ్ విద్యార్థుల విద్య సామర్థ్యలు పరిశీలించారు.మొత్తం పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉన్నారు అందరు విద్యార్థులు కూడా తెలుగులో రాయడం,చదవడం గణితంలో చతుర్విద ప్రక్రియలు అందరూ చేయగలిగారు. పాఠశాలలో చక్కని టీచర్ లర్కింగ్ మెటీరియల్ తో కృత్యాధార బోధన ద్వారా విద్యాబోధన గావిస్తున్నారని ప్రధానోపాధ్యాయురాలు నస్రీన్ తెలియజేశారు . విద్యార్థులు ఉత్సాహంగా విద్య సామర్థ్యలు చక్కగా నేర్చుకొంటున్నారు.చక్కటి టీచర్ లర్కింగ్ మెటీరియల్ తో పాఠశాల ఆవరణం చాలా బాగుంది.ఈ పాఠశాలలో విద్య సామర్థ్యలు ప్రధానోపాధ్యాయురాలు నస్రీన్ భాగా పెంపొందించుతూ ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా ఎం పి పి యస్ దిగువ బోయపల్లి పాఠశాలలో ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం ఊరి బడిని కాపాడుకుందాం కార్యక్రమములో విద్యార్థులు ఆకర్షితులై ఈ పాఠశాలలో చేరారు.ఇప్పుడు ఈ పాఠశాల విద్యార్థుల సంఖ్య 27 కి చేరింది.ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులతో మండల విద్యాశాఖాధికారి ద్వారకానాథ్,ప్రధానోపాధ్యాయురాలు నస్రీన్ , అంగన్వాడీ టీచర్ రామతులసి మాట్లాడుతూ ఇంకా విద్యార్థుల సామర్థ్యల కోసం కృషి చేస్తామని చెప్పారు.రాబోవు విద్యా సంవత్సరం నుండి ఇంకొక టీచర్ ని కూడా నియమిస్తారని తెలిపారు.