ఊహించని ఫలితం … వికసించిన కమలం.

(సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ షేక్ అజ్మత్ అలీ మెట్పల్లి మండల్) 14 ఫిబ్రవరి 2026. మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితం వెలువడింది త్రిముఖ పోటీలో (కాంగ్రెస్) మరియు (బిఆర్ఎస్) పార్టీలకు భారతీయ జనతా పార్టీ గట్టి షాక్ ఇచ్చింది ఏ కంగా 10 సీట్లను బిజెపి కైవసం చేసుకుంది .టికెట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించిన బిజెపికి టికెట్ కావాలని దరఖాస్తు చేసిన నాధుడు కనిపించలేదు .పైగా అరవింద్ కి ,సురభికి మధ్య టికెట్ కేటాయింపులు సమన్వయం కొరవడిందని వార్తలు వినిపించాయి. చివరికి జిల్లా అధ్యక్షులు డా. యాదగిరి బాబు పార్టీలోనే అసమ్మతి కనబడకుండా తనదైన శైలిలో పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు చివరికి ఊపు మీదున్న కాంగ్రెస్ కి మరియు బిఆర్ఎస్ కి సవాలు విసిరి ఊహించని ఫలితాన్ని రాబట్టారు. గెలిచిన అభ్యర్థుల పేర్లు 5 వ వార్డు పుడు కారం దివ్య రెడ్డి.7 వ వార్డు ధర్మపురి స్వరూప. 9 వ వార్డు బొడ్ల వసుధ.14 వ వార్డు దొనికెల శిరీష.15 వ వార్డు అరిగేలా అనూష.16 వ వార్డు అరిసె వనజ.18 వ వాడు చెట్లపల్లి మీనా.19 వ వార్డు బొడ్ల ఆనంద్.23 వ వార్డు కోయల్కర్ స్రవంతి.26 వ వార్డు బొడ్ల రమేష్.