(సాక్షి డిజిటల్ రిపోర్టర్ విగ్నేష్ ఫిబ్రవరి 14) సూరంపల్లి గ్రామం: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రం లోని సూరంపల్లి గ్రామంలో వీధి కుక్కల బీభత్సం కలకలం రేపింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న మూడు సంవత్సరాల చిన్నారి మోక్షితపై కుక్కలు తీవ్రంగా దాడి చేయడంతో గ్రామంలో భయాందోళనలు నెల కొన్నాయి. బాధిత చిన్నారి తండ్రి నవీన్ తెలిపిన వివరాల ప్రకారం, ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా, చిన్నారిని చికిత్స కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించారు.
స్థానిక గ్రామస్తులు మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా గ్రామంలో వీధి కుక్కలు తరచూ ప్రజలను వెంటాడుతూ కరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిపై జరిగిన దాడి ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర భయాం దోళనలకు గురవుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో తిరుగుతున్న కుక్కలను పట్టుకొని షెల్టర్ హోమ్‌లకు తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రజల భద్రత కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
