ఆర్డిటి ఎఫ్ సి ఆర్ ఏ రెన్యువల్ సమస్యను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.

★అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి ★

అనంతపురం. ఫిబ్రవరి 14, రిపోర్టర్ ముంగా ప్రదీప్ అనంతపురం ఈరోజు అనంతపురం యన్.జి. హోమ్ నందు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ, అనంతపురం జిల్లాకు కల్పవృక్షంగా ఉన్న ఆర్టీడి సంస్థ కోసం తమ వంతు కృషి చేస్తామని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి తెలిపారు. అనంతపురం నగరంలోని ఎన్జీవో హోం నందు సేవ్ ఆర్ డి టి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శ్రీధర్ చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ చౌదరి మాట్లాడుతూ ఆర్డిటి సంస్థ రెన్యువల్ కోసం ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి అమిషాను కలిశారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆర్డిటి రెన్యువల్ పై ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. నేడు జరిగిన సమావేశంలోని అంశాలను జిల్లా మంత్రి పయ్యాల కేశవ్ , ఎంపీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తామన్నారు.సేవ్ ఆర్ డి టి కోసం పాటుపడుతున్న నాయకులను శ్రీధర్ చౌదరి అభినందించారు. ఈ ఉద్యమానికి తమ వంతు ప్రోత్సాహం అందిస్తామని శ్రీధర్ చౌదరి పేర్కొన్నారు.