ఆర్కే వ్యాలీ కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రతిష్టాత్మక ప్లేస్మెంట్లు

★ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా

సాక్షి డిజిటల్ న్యూస్ ,వేంపల్లె, ఫిబ్రవరి:14 (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్కే వ్యాలీ) కెమికల్ ఇంజనీరింగ్ విభాగం నాలుగవ సంవత్సరం విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో ప్లేస్మెంట్లు సాధించినట్లు ఆర్కేవ్యాలీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో జెట్ కార్యక్రమానికి వార్షిక వేతనం ₹ 7.5 లక్షలు తో పి దస్తగిరి భాష, జీ విశ్ణువర్థన్ రెడ్డి, కే లక్ష్మీ దీపిక, ఎం దివ్యలక్ష్మి ఎంపికయినట్లు తెలిపారు. అదేవిధంగా డెక్కన్ ఫైన్ కెమికల్స్ లో వార్షిక వేతనం ₹4.75 లక్షలు తో పి దస్తగిరి భాష, జీ విశ్ణువర్థన్ రెడ్డి, ఎం దివ్యలక్ష్మి, కే నితిన్, కే లక్ష్మిపతి, పి హేమంత్ కుమార్ ఎంపికయ్యారు.ఈ సందర్భంగా డైరెక్టర్ కుమారస్వామి, కెమికల్ ఇంజనీరింగ్ ఫాకల్టీ కోటేశ్వరి , సౌజన్య , సురేష్ , చంద్రశేఖర్ , ప్లేస్మెంట్ ఆఫీసర్ సుందర్ విద్యార్థులను అభినందించారు.