సాక్షీ డిజిటల్ న్యూస్ జిల్లా:వనపర్తి మండలం:చిన్నంబావి, రిపోర్టర్:క్రాంతి కుమార్, చిన్నంబావి & వీపనగండ్ల మండలాల లోని చుట్టుపక్కల గ్రామాల నుండి కటింగ్ చేసి తీసుకువచ్చిన ఆయిల్ ఫామ్ గెలలను గోవర్ధనగిరి గ్రామం దగ్గర లోడింగ్ చేయడం జరిగింది. కలెక్షన్ పాయింటును హార్టికల్చర్ ఆఫీసర్ కృష్ణయ్య సార్ సందర్శించడం జరిగింది,సార్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో మొత్తం 5800 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేయడం జరిగింది,అందులో 2022-2023 నాటిన తోటలు కోతకు రావడం వాటిని మండలాలలోని కలెక్షన్ పాయింట్ తీసుకురావడం, వాళ్లకు అమౌంటు 15 రోజులకు రావడం, అలాగే 30 సంవత్సరాల వరకు నిరంతరం ఆదాయం & లాభదాయకం ఉండే పంట కావున ఇప్పుడు ఆయిల్ ఫామ్ తోటలపై గవర్నమెంట్ 90% సబ్సిడీ ఇస్తుంది. కావున నీటి వసతి & ఆసక్తి ఉన్న రైతులు ఉపయోగించుకోగలరు అని తెలిపారు.