సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 రాము కుప్పం రిపోర్టర్ జయరాం రెడ్డి చిత్తూరు జిల్లా, రామకుప్ప మండల కేంద్రంలో చిత్తూరు జిల్లా ఆప్త ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్లు మరియు డైరీలను మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున మరియు నారాయణ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి మరియు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా (APPTA) ఉపాధ్యాయ సంఘం కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు అన్సర్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి కౌసర్ అహ్మది పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు ఎల్లప్పుడూ తమ హక్కుల కోసం పోరాడుతూ పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్యను బోధించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధనుంజయరాజు, ఉపాధ్యాయులు మహబూబ్ జాన్, దిలీప్ కుమార్, ప్రసాద్, రాజేంద్ర, రంగనాథ్, శంకర్, గిరి, అంజప్ప కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.