ఆదర్శ పాఠశాలలో ఘనంగా వీడ్కోలు వేడుక

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14, మల్లాపూర్ మండలం రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య: మల్లాపూర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం వీడ్కోలు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్ సీనియర్ విద్యార్థులకు, జూనియర్ విద్యార్థులు వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో,ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భూమేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.