అత్యంతవైభవంగా మరిడిమాంబ తీర్థం

సాక్షి డిజిటల్ న్యూస్ 14 ఫిబ్రవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, మండలంలోని తామరబ్బ పంచాయతీ శివారు బొడ్డపాడు గ్రామంలో గ్రామ దేవత మరిడిమాంబ తీర్థం శుక్రవారం అత్యంత వైభవంగా గ్రామ పెద్దలు నిర్వహించారు అమ్మవారికి ఉదయం 5 గంటల నుంచి ధూప దీప నైవేద్యంతో ప్రత్యేక పూజలు జరిగాయి అమ్మవారికి మాజీ ఎంపిపి కిలపర్తి భాస్కర్ రావు టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు పెద్దాడ వెంకటరమణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రధమ ద్వితీయ బహుమతులు అందజేశారు సాయంత్రం మహిళల జానపద కోలాటాలతో అంగరంగ వైభవంగా అమ్మవారి తీర్థ మహోత్సవాలు తెలియజేశారు రాత్రి పలు సంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి అమ్మవారిని దర్శించుకున్న వారిలో మండల టిడిపి పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు మొసలి పైడిరాజు ఎంపీపీ స్కూల్ చైర్మన్ వంజంగి సూర్యనారాయణ కొమ్ము శివ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *