సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14, పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి ( గంగాడ గౌరీ శంకర్ ) 108 అంబులెన్సు లో ఉద్యోగులుగా పనిచేస్తున్న EMT (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీసియన్ ) PILOT (డ్రైవర్ ) లకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీనియర్స్ కి 2 వేలు, జూనియర్స్ కి 5 వేలు రూపాయలు పెంచుతూ నిధులు విడుదల చేశారు. పెరిగిన జీతాలు ఈ నెల నుండే అమలులోకి వచ్చేలా చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 108 ఉద్యోగులు అందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అలాగే 108 నిర్వహణ సంస్థ అయిన భవ్య కంపెనీ వారికీ కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ సందర్బంగా పాలకొండ 108 అంబులెన్సు లో పనిచేస్తున్న సిబ్బంది మాట్లాడుతూ మరింత మెరుగైన సేవలు ఆపదలో ఉన్న వారికీ అందిస్తూ ప్రభుత్వం కి అలాగే భవ్య కంపెనీ వారికీ మంచి పేరును తెస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమం లో గిరి గణపతి, శ్రీనివాస్, మురళి, అనంత్ రావు లు పాల్గొన్నారు.