87వ వార్డ్ లో ఫుట్ పాత్ పనులు ప్రారంభం….

సాక్షి డిజిటల్స్ విశాఖ ప్రతినిధి సంజయ్, ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం (జగన్) గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధి వడ్లపూడి ప్రాంతం నుండి ఫుట్ పాత్ పనులు ప్రారంభిం చడం జరిగింది. ఈ పనులను రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాధం జగన్ పరిశీలించ డం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిదులు మాట్లాడుతూ హైవే నుండి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు ఇరువైపులా ఫుట్ పాత్ పనులకు జీవీఎంసీ నిధులు మంజూరు చేయించుకోవడం జరిగింది. అందులో భాగంగా వడ్లపూడి హైవే నుండి పనులు ప్రారంభం అయ్యాయని సంబంధిత అధికారులను కలిసి పనుల పట్ల నాణ్యత తగ్గకుండా పనులు పూర్తి చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమం లో మాజీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ రాజన్ రాజు, కడుపుట్ల శ్రీను, విశ్వేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.