సార్వత్రిక సమ్మెతో కేంద్ర ప్రభుత్వంపై అసంఘటితంగా పోరాటం చేయాలి.

★మనవహారం నిర్వహించిన కార్మికులు, నాయకులు. ★గార్లలో కార్మిక సంఘాల దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం. ★గార్ల లో నిర్వహించిన ర్యాలీ లో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర నాయకులు-పి. సోమయ్య

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) సార్వత్రిక సమ్మెతో కేంద్ర ప్రభుత్వ తీరు పై సంఘటితంగా పోరాటం చేయాలని, అన్ని వర్గాల కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దుర్మార్గపు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమంలోకి రావాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సోమయ్య పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం గార్ల మండల కేంద్రంలో కార్మిక సంఘాలు,రాజకీయ పార్టీలు, యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సమ్మెను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సోమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలు అమలు చేయాలని, నూతన విత్తన చట్టాన్ని నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, వి బి జి రామ్ జి ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె లో వామపక్ష పార్టీ ల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు కందునూరి శ్రీనివాస్, కట్టెబోయిన శ్రీనివాస్,జడ సత్యనారాయణ, అలవాల సత్యవతి, గంగావత్ లక్ష్మణ్ నాయక్,శీలం శెట్టి రమేష్ లు మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడటం, కనీస వేతనాల పెంపు కోసం పోరాటం అత్యవసరమని, మనువాద, బ్రాహ్మణీయ, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, రైతు లు, రాజకీయ పార్టీ ల నాయకులు, ప్రజల కు వారు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ సమ్మెకు పట్టణంలోని వ్యాపారస్తులు, వాణిజ్య, విద్యాసంస్థలు,వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించి సమ్మెకు మద్దతు తెలిపారు. మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం నుండి ప్రారంభమైన సమ్మె నెహ్రు సెంటర్, డోర్నకల్ రోడ్డు, బాలికల పాఠశాల,ఎస్ బి ఐ ఎటిఎం సెంటర్,మెయిన్ రోడ్డు,బయ్యారo రోడ్ మీదుగా సాగింది. ఈ సమ్మె లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్ టీ యూ కార్మిక సంఘాల నాయకులు, బి. అప్పిరెడ్డి, ఎ. వీరాస్వామి, జె. వెంకన్న, జి. సక్రు,జె. విశ్వ,సీఐటీయూ అనుబంధ సంఘాల నాయకులు, సిపిఎం నాయకులు జి.రాజారావు, వి. వెంకటేశ్వర్లు, యం. నాగమణి,కె ఈశ్వర్ లింగం,ఐ. గోవింద్, సి హెచ్.ఎల్లయ్య, కై బాబు, సత్యం, టీ. రమా, మౌనిక, అంగన్వాడీలు నీలాదేవి, టీ. పద్మ, కె.వసంత, విక్టోరియా, కృష్ణకుమారి,ఆశా వర్కర్ లు రమాదేవి, ఉమాదేవి, ఆశకుమారి, సుజాత, వివో ఎల్ లు అనిత, రమా,చంద్రకళ, మౌనిక, మధ్యాహ్న భోజన కార్మికులు మల్లేశ్వరి,పద్మ,ముత్తమ్మ,రేణుక, పద్మ,గ్రామపంచాయతీ కార్మికులు పిడమర్తి దాసు, శంకర్, శ్రీను, భద్రు, అశోక్, హామాలి లు మల్లయ్య, సర్వర్, ప్రవీణ్,రాము, భిక్షం జానీ, పూర్ణ,రాము,అశోక్, బిల్డింగ్ రంగం నుండి మౌలానా, జడ శ్రీను, రవీందర్, లల్లు,మాధవరావు, లాలు, నాగేశ్వరరావు, సత్తి, వెంకన్న, నాగరాజు, యాదగిరి తదితరులు ఉన్నారు.