జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ ఫిబ్రవరి 12 పీ.ఏ.పల్లి మండలం నల్గొండ జిల్లా జనం న్యూస్ గుడిపల్లి మండలం లోని కోదండాపురం గ్రామంలో పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రమ్మోత్సవాలలో ఈ రోజు హోమం,బలిహరణం,పూర్ణాహుతి, చక్ర స్నానం, సాయంకాలం దేవతా ఉద్వాసన, మూగబలి, ధ్వజ పట ఉద్వాసన, పంచ హారతి, ఏకాంత సేవలు,తెల్లవారు జామున దోపు ఉత్సవం తో బ్రమ్మోత్సవాలు పరిసమాప్తం అని ఆలయ కమిటీ చైర్మన్ చెప్పాడు.ఈ ఏడు రోజుల బ్రమ్మోత్సవాలు ప్రశాంతంగా జరిగావి అని కొనియాడారు. ఈ పూజ కార్యక్రమములు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ చార్యులు, శ్రీధర చార్యులు, శ్రీకాంత్ చార్యులు, శ్రీ రమణ చార్యులు సమక్షం లో జరిగినవి.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి పాలక మండలి సభ్యులు వెంకటరమణ చారి,నక్క బిక్షం, పోషం రెడ్డి సైది రెడ్డి,పోలే ఇందిరా, బాలబోయిన వెంకటయ్య, ఇంద్రకంటి లక్ష్మయ్య, గ్రామపెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొని బ్రహ్మోత్సవాలని విజయవంతం చేశారు. క్రీడాకారుల కి బహుమతులు ప్రధానం చేశారు. జాతరకు అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.