(సాక్షి డిజిటల్ న్యూస్ మెట్ పల్లి షేక్ అజ్మత్ అలీ )ఫిబ్రవరి 13, పట్టణం లోని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని మాల లకు ఇవ్వాలని మెట్టుపల్లి మాల సంఘాల జేఏసీ నాయకులు జనరల్ సెక్రెటరీ బిట్లుగు కార్తీక్ డిమాండ్ చేశారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బాగా 13వ వార్డు 16వ వార్డు నాలుగో వార్డ్ ఎస్సీలకు కేటాయించడం జరిగిందని మాల సామాజిక వర్గానికి వైస్ చైర్మన్ పదవిని ఇవ్వాలని అన్నారు. మెట్పల్లి మున్సిపాలిటీని కొమిరెడ్డి రాములు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందని ఆ ఏర్పాటు కొరకు మాల సంఘాలు ఆనాటి మెట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కు మునిసిపాలిటీని ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారని మున్సిపాలిటీ ఏర్పాటు లో మాల సంఘాలు ఎంతో కృషి చేశాయని కాబట్టి అప్పటినుండి ఇప్పటివరకు మాలలకు మెట్టు పల్లి మున్సిపాలిటీలో అన్యాయం జరిగిందని అన్నారు. మున్సిపాలిటీ ఏర్పార్టులో ప్రధాన పాత్ర పోషించిన మాలలకు అన్యాయం జరగకూడదు అని దాని కొరకు మేము కలిసికట్టుగా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన మాలలకు మునిసిపల్ వైస్ చైర్మన్ ఇవ్వాలని మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని మాల సంఘాల జేఏసీ జనరల్ సెక్రెటరీ బిట్లు గు కార్తీక్ అన్నారు, సుమారు గా మాలలు మెట్ పల్లి పట్టణం లో 5200 మంది ఓటర్లు ఉంటారు అని అన్నారు ఇందిరానగర్ లోని మూడు మాల సంఘాలు అంబేద్కర్ నగర్‌లోని మాల సంఘం ఆదర్శనగర్‌లోని మాల సంఘం రేగుంట మాల సంఘం ఆర పేట మాల సంఘం వెంకట్రావుపేట మాల సంఘం వారందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి మెట్టుపల్లి మునిసిపాలిటీ వైస్ చైర్మన్ గా ఎస్సీ మాల కే కేటాయించాలని తీర్మానం చేశామని మాల సంఘాల జేఏసీ జనరల్ సెక్రెటరీ బిట్లు కార్తీక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల నాయకులు కారం నరేష్, గుమ్మడి విక్రమ్, కారం కిషోర్, బక్కూరి మధు, మూగల శేఖర్ ,కరికి చిన్న గంగారం, దొంగేరీ నరేష్, రాసమొల్ల సురేష్ , కావలి బాలకిషన్, మేకల వెంకట్ మేకల రాజేష్, బూరం సంజీవ్ ,సురేష్, మేకల ఉపేందర్ ,భూరం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.