వెన్నం రాఘవేందర్ రెడ్డి మృతదేహానికి టియుడబ్ల్యూజే (ఐ.జే.యు) జిల్లా నాయకుల ఘన నివాళులు.

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రెడ్యాల మాజీ సర్పంచ్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బిగ్ టి.వి చైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి ల తండ్రి రాఘవేందర్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో మహబూబాబాద్ టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి లు మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామంలో రాఘవేందర్ రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, బి.గ్ టివి చైర్మన్ విజయ్ రెడ్డి తో మాట్లాడి ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేశారు. మహబూబాబాద్ జిల్లా జర్నలిస్ట్ ల పక్షాన పితృవియోగానికి గురైన కాంగ్రెస్ రాష్ట్రనాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బిగ్ టివి చైర్మన్ విజయ్ రెడ్డి లకు, వారి కుటుంబ సభ్యులకు టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లా యూనియన్ సభ్యులు మండలాల నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *