జనం న్యూస్ ఫిబ్రవరి 12 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోరంట్ల ప్రకండ అధ్యక్షులు అన్నపూర్ణ ఆదినారాయణ మరియు దాతల చేతుల మీదుగా 50 మంది నిరుపేద గర్భిణీ మహిళలకు శ్రీమంతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ విద్యాధరణి , జిల్లా ప్రముఖ అక్కుల్ రెడ్డి , డాక్టర్ మహేష్ ఎంబీబీఎస్ ఎండి– చిల్డ్రన్స్ స్పెషలిస్ట్) హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు పండ్లు, స్వీట్స్ వస్త్రాలు, అందజేసి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ, గర్భిణీల ఆరోగ్యం సమాజానికి ఎంతో ముఖ్యమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా, రమేష్, ఓం ప్రకాష్, వృషభ దేవుడు, దేవాంగం నరేష్, బజరంగ్ దళ్ జయసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భక్తి, సాంప్రదాయ వాతావరణంలో నిర్వహించబడింది.