విద్యార్థులకు ఉపన్యాస పోటీలు

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 13,రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాలలో సరోజినినాయుడు జన్మదినం పురస్కరించుకొని ఆంగ్ల భాష దినోత్సవాన్ని గురువారం జరుపుకొన్నారు. సరోజినినాయుడు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఆంగ్ల ఉపాధ్యాయులు కొండూరి రజనీకాంత్ ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముక్కాల మోహన్ రెడ్డి, వేముల మధు, కల్వకోట కార్తీక్, వేముగంటి గిరిధర్, అంతడుపుల గంగారాజం, సిద్దె గంగారాజం, రాపర్తి నర్సయ్య లు పాల్గొన్నారు.