లేబర్ కోడ్లు అమలును ప్రతిఘటిస్తాం

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద ఫిబ్రవరి 13, లేబర్ కోడ్స్ అమలును ప్రతిఘటిస్తున్నామని ఉద్యమ కార్మికుల సంఘాల నాయకులు తెలిపారు ఈ కార్యక్రమం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా స్థానిక హోళగుంద లోని గురువారం వాల్మీకి సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ సమ్మెకు సీఐటీయూ నాగరాజు అధ్యక్షత వహించారని సమ్మెలో రైతు సంఘం నాయకులు వెంకటేష్ ఐఎఫ్టియు నాయకులు సవరప్ప మునిస్వామి. ఈరన్న ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వెంకటేష్ సీపీఐ నాయకులు రంగన్న వీఆర్ఏ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య ఆశ వర్కర్ సలోమీ అంగన్వాడీ టీచర్ పర్మిల మాట్లాడుతూ,, దేశంలో ఉద్యోగులు కార్మి కుల పట్ల చాలా వివక్షత కొనసాగుతున్నదని అన్నారు. కార్మికులకు దాదాపు 12 సంవత్సరాలుగా కనీస వేతన చట్టాన్ని సవరించలేదని , ప్రభుత్వం పెట్టుబడి దారులకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు రాయతిలిస్తూ వారిని మరింత ధనవంతులు గా మారుస్తున్నదని అన్నారు , కార్మికులకు కనీస వేతనాలు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, మొండి చేయి చూపిందని విమర్శించారు బ్రిటిష్ కాలం నుంచి కొనసాగిన కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గ మైన చర్య అని తెలిపారు ..సమాజ సేవకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న అంగన్వాడీలకు ఇంటింటికి ఆరోగ్య సేవలు చేస్తూ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఆశ వర్కర్లకు, కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలుగా వేత నాలు పెంచకుండా జాప్యం చేస్తున్నదని అన్నారు. స్కీం వర్కర్లకు వి ఆర్ ఏ లకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె హక్కును నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మిక వర్గం రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పతనం అవుతుందని అన్నారు. సమ్మెలో అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్ష్ ఆశావర్కర్లు రైతు, తలారీ సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు సమతాగేరి హమాలీ సంఘాలు, ఆటో భవన కార్మికులు పాల్గొని జయప్రదం చేశారు.