రైతు కష్టం ఫలించేనా జన్నారం మండలంలో ఏపుగా పెరిగిన వరి

*బావులు మోటార్లు ఆధారంగా రైతు వరి పంట వేసవి తీవ్రతకు చేతుకు అందుతుందా

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్, జన్నారం మండలంలోని ఏసంగి వరి నాట్లు గత నెల రోజుల నుండి ముమ్మరంగా వేసినప్పటికీ బావి బోర్ మోటారా తో పాటు చెరువుల క్రింద పొలాలు ఏపుగా పెరిగి రైతుకు ఆనందాన్ని కలిగించే పద్ధతిలో వరి మాగాని ఉంది మెట్ట ప్రాంతంలోని చిరుధాన్యాల పంటలకు కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ నుండి వచ్చే నీరు ఒకరకంగా ఆరుతడుల పద్ధతిలో వెసులుబాటు కలిగే విధంగా ప్రస్తుతం ఉంది మూడు నెలల వరి పంట చేతికి అందాలి అంటే భారీ ఎండలు భవిష్యత్తులో ఏప్రిల్ మే లో కొట్టే పరిస్థితిలో పొట్ట దశ నుండి వరి చేతకందే పరిస్థితిలో ఇబ్బందులు జరగకుండా కడెం ప్రాజెక్టు నుండి వచ్చేటటువంటి నీరును చెరువుల్లో నింపి వరి పంట పూర్తిగా చేతుకు అందే విధంగా మరియు మొక్కజొన్న పెసర కూరగాయల పంటలు పండే విధంగా రైతన్న నీటిపారుదల శాఖ ఆదుకోవాల్సిన అవసరం ఉంది వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సమావేశాన్ని ఏర్పరిచి నీటి వినియోగాన్ని వృధా చేయకుండా వాడకం పద్ధతులను తెల్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *