మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

సాక్షి డిజిటల్ న్యూస్:ఫిబ్రవరి 13 ఆత్మకూరు ఎం మండల రిపోర్టర్ మేడి స్వామి, పుల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో పని చేస్తున్న సిబ్బంది జోగు పారిజాత అత్త జోగు లక్ష్మమ్మ ఇటీవల మృతి చెందరు వారి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ తరపున 19,000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.​ఈ సందర్భంగా సర్పంచ్ నర్రముల రామలింగయ్య పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ వార్డు మెంబర్లు గ్రామపంచాయతీ సిబ్బంది మాట్లాడుతూ గ్రామంలో నిరంతరం శ్రమిస్తున్న సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో సమానమని కష్టకాలంలో వారిని ఆదుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.