జనం న్యూస్ ఫిబ్రవరి 12 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మండల ప్రతినిధి శివశంకర్ అశ్వారావుపేటమండలం లో వినాయకపురం గ్రామ సమీపంలో కొలువై ఉన్న శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారికి భక్తులు తమ ఉదారతను చాటుకున్నారు. ఏలూరు జిల్లా కుక్కునూరు గ్రామానికి చెందిన పుప్పాల సురేష్ - వరలక్ష్మి దంపతులు గురువారం చిలుకలగండి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాము మొక్కుకున్న విధంగా సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయల విలువైన అర కేజీ వెండి పూలదండను అమ్మవారికి సమర్పించరు ఈ కార్యక్రమం లో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ నారాల శ్రీనివాసరావు, వైస్ సర్పంచ్ నారం జగదీష్, బెతి రాజశేఖర్ మరియు అర్చకులు జక్కుల అబ్బులు, గరిగిపాటి నాగు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ, కుమార్ అయ్యగారు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దంపతులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. గ్రామ దేవతకు వెండి ఆభరణాన్ని సమర్పించిన సురేష్ దంపతులను గ్రామస్థులు మరియు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.