జనం న్యూస్ ఫిబ్రవరి 13 ప్రతినిధి ఎండి జహంగీర్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓం నగర్ కాలనీలో శ్రీలలితా సహస్ర నామ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో14వ వార్షికోత్సవం సందర్భంగా ఓంనగర్ కాలనీ బోర్డు దగ్గర శ్రీశైలం వెళ్తున్న శివదీక్ష స్వాములకు, కాలినడకన వెళుతున్న శివ భక్తులకు గురువారం నాడు మడితో కూడిన అల్పాహారం,అన్న ప్రసాదం పండ్లు పంపిణీ చేసినట్లు శ్రీ లలిత సహస్ర సేవా ట్రస్ట్ అధ్యక్షురాలు మిడిదొడ్డి వరలక్ష్మి తెలిపారు.గత ఆరు రోజులుగా శివ స్వాములకు మధ్యాహ్నం అన్న ప్రసాదం,ఉదయం పూట రాత్రి సమయంలో అల్పహారం ట్రస్ట్ ద్వారా మహిళా భక్తులచే పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.నేటి మధ్యాహ్నంతో పంపిణీ కార్యక్రమం ముగిసిందని తెలిపారు.సహకరించిన దాతలకు సభ్యులకు పరమశివుని కృపా ప్రాప్తిస్తుందన్నారు.ఈకార్యక్రమంలోట్రస్ట్ సభ్యులు ఆకారపు యాదమ్మ, తిరుపతమ్మ, శారద, దాసర్ల పుష్పలత, సుజాత, రేణుక, జ్యోతి, లావణ్య,లక్ష్మి, వరలక్ష్మి, విశాలాక్షి, రాధా,పావని, అర్చన ,కరుణ, సాయిలీల, మిడిదొడ్డి పాండు రంగయ్య కుటుంబ సభ్యులు,ఏ.రామ్మోహన్,నంద కిషోర్,టెంట్ హౌస్ ప్రశాంత్ రెడ్డి,రమణ, మహిళలు,కాలనీవాసులు,శివ భక్తులు తదితరులు పాల్గొన్నారు.