మణుగూరులో సార్వత్రిక సమ్మె విజయవంతం

★సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ విప్లవ జేజేలు ★కృతజ్ఞతలు తెలిపిన అఖిలపక్ష కార్మిక సంఘాలు

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 13 మణుగూరు /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్పు చేసి కార్పొరేట్ సంస్థలకు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే ప్రయత్నాలు ఉపసంహరించు కోవాలని. డిమాండ్ చేస్తూ జాతీయస్థాయిలో కార్మిక సంఘాల పిలుపులో భాగంగా గురువారం నాడు మణుగూరులో సార్వత్రిక సమ్మె విజయవంతం అయిందని ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. గురువారం ఉదయం నుండి జేఏసీ నాయకులు బృందాలుగా వివిధ గనులు డిపార్ట్మెంట్లలో సమ్మెను సమీక్షించారు. అనంతరం బండారుగూడెంలో జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు తహశీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. కొద్దిసేపు ధర్నా నిర్వహించి అనంతరం తహశీల్దార్ అద్దంకి నరేష్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడారు. ఇప్పటి కైనా కేంద్రం నాలుగు లేబర్ కోడ్ ల అమలు ప్రయత్నాలు విరిగించుకోవాలని లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళ నలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు వై రాంగోపాల్, ఐ ఎన్ టి యు సి నాయకులు వత్సవాయి కృష్ణం రాజు,సిఐటియు నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, టీబీజీకే నాయకులు నాగేల్లి వెంకట్, ఐ ఎఫ్ టి యు నాయకులు ఏ చంద్రం, టి యు సి ఐ నాయకులు ఆర్ మధుసూదన్ రెడ్డి, కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు జి వెంకటేశ్వర్లు, వెలగపల్లి జాన్, గద్దల శ్రీనివాస్, అంగోత్ మంగీలాల్, వీరభద్రం, సిపిఐ నాయకులు దుగ్యాల సుధాకర్, రాజబాబు, మహిళా సంఘం నాయకులు మున్నా లక్ష్మీకుమారి, కాంట్రాక్ట్ కార్మికులు ఇమామ్ బి, బత్తుల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.