మంజూరైన డ్రైనేజీ వెంటనే నిర్మించాలని వినతి

జనం న్యూస్ 12ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. సిర్పూర్ (యు) :మండల కేంద్రంలో S.C.కాలనీ లో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన డ్రైనేజీ వెంటనే నిర్మించాలని దళిత నాయకులు కొత్తూరీ ఆంధ్రఅయ్యా ఆధ్వర్యంలో ఎంపీడీవో కృష్ణారావు కి వినతి పత్రం అందజేచేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ డ్రైనేజీ కొరకు సబ్ ప్లాన్ ద్వారా నిధులు మంజూరు అయినయి అన్నారు. డ్రైనేజీ పనులు పూర్తికాక పోవడం వలన నీళ్లు పైపులలో చేరుతున్నాయి అన్నారు.డ్రైనేజీ లేకపోవడంతో దోమలు వల్ల కాలనీ వాసులు డెంగు, మలేరియా,లాంటి వ్యాధుల వల్ల రోగాల బారిన పడుతున్నారు.సదరు కాంట్రాక్టర్ తో డ్రైనేజీ పనులు చేపట్టాలన్నారు. డ్రైనేజీ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో చిట్యాల ప్రేమ్ సాగర్,చిట్యాల. శంకర్, చిట్యాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు