భారీ ర్యాలీ నిదర్శనం

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 కర్నూలు జిల్లా కౌతాళం మండలం, నాలుగు రెబల్ రోడ్డు రద్దు చేయాలని.
కార్మిక ,రైతాంగ వ్యతిరేక విధానాలు విడనాడకపోతే గుణపాఠం తప్పదు. కౌతాళంలో భారీ ర్యాలీ, ప్రదర్శన అంబేద్కర్ సర్కిల్లో రాస్తారోకో. సభ. కౌతాళం మండల కేంద్రం ముందు కార్మిక, రైతు విధానాలకు వ్యతిరేకంగా అంగన్వాడీ, ఆశ, గ్రామ సేవకులు ,,ఆటో కార్మికులు, పంచాయతీ వర్కర్స్, 108 కార్మికులు, కెవిపిఎస్ రైతులు వేకాస సిపిఐ రైతు కూలి సంఘం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సిఐటియు ఆఫీసు నుంచి మెయిన్ బజార్ గుండా ఆంజనేయ స్వామి టెంపుల్ దర్గా మీదుగా అంబేద్కర్ సర్కిల్ ర్యాలీగా చేరి అక్కడ మానవహా రంగా ఏర్పడి సభ కు అంగన్వాడి నాయకురాలు అధ్యక్షత వహించినారు. ఆ సభను ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య రైతు కూలీ సంఘం నాయకులు జగదీష్ సంయుక్తంగా మాట్లాడుతూ
కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు .కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని చెప్పారు .పని గంటల పెంపు, యూనియన్ రిజిస్ట్రేషన్ పై ఆంక్షలు, కనీస వేతనాలు అమలు కాకపోవడం ,ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి అనేక ప్రమాదకర అంశాలు లేబర్ కోడ్లులో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడి ,ఆశ , గ్రామ సేవకులకు స్కీం వర్కర్లకు వేతనాలు పెంచాలని, రిటైర్డ్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల పై వేధింపులు ఆపాలని ,ఉపాధి గ్యారెంటీ కల్పించాలని ఆయన అన్నారు. అమెరికాతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వలన వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు. అన్ని రకాల పంటల రైతులు, పాడి రైతులు నష్టపోతారన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, రైతాంగాన్ని రక్షించాలని అన్నారు. వి బి జి రామ్ జి పథకం రద్దుచేసి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ హక్కు చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని వారు అన్నారు. రైతు వ్యతిరే క విత్తన చట్టం, కేంద్ర విద్యుత్తు సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేసినారు .రైతుల కోరుతున్న మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని ఆయన అన్నారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు విడనాడకపోతే తగిన గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బి ఈరన్న ,నాయకులు హనుమంతు ,నాగరాజు, వీరేష్, నారాయణ, అంగన్వాడి నాయకురాలు విజయలక్ష్మి, రోజు మేరీ ,మీనాక్షి, దీప్తి, రత్నమ్మ ,శోభ, జయలక్ష్మి, రాధా, ఆశ నాయకురాలు విజయలక్ష్మి చాంద్ బి, రామ లక్ష్మి, గ్రామ సేవకులు నాగరాజు ,మారప్ప,రంగప్ప ముకప్ప,కెవిపిఎస్ నాయకులు చిన్న మారయ్య, వీరేష్, ఆదామ్ ,నాగరాజు, ఆటో కార్మికులు నాగరాజు ,ఈరన్న, పంచాయతీ కార్మికులు వెంకటస్వామి, రైతు కూలి సంఘం నాయకులు జగదీష్, మా భాష ,వీరేష్ ,అక్రమ్ సిపిఐ నాయకులు ఈరన్న తదితరులు పాల్గొన్నారు.