సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి.12 బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి. రాయలసీమప్రాంత అభివృద్ధికి కీలకమైన రైల్ వే లైన్ ఏర్పాటు చేయాలని వినతి రాయలసీమ ప్రాంత అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలోనే సాధ్యం.. రైల్ వే లైన్ ఏర్పాటు పై సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. మంత్రి వెంటా ఎంపీ పురందేశ్వరి , అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్. బెంగళూరు నుంచి కడప వరకు కొత్త రైల్వే మార్గం ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో డిల్లీలో సమావేశమై కోరారు. ఈ భేటీలో ఎంపీ పురందేశ్వరి, అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెంగళూరు–కడప రైల్వే మార్గం ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలోనే సాధ్యం అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.ప్రాంత ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన ఈ రైల్వే మార్గాన్ని త్వరితగతిన మంజూరు చేయాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.